పసుపు ప్రయోజనాలు, ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు: తెలుగులో – Turmeric Benefits in Telugu


భారతదేశంలో విస్తృతంగా వాడబడే ఆరోగ్యకరమైన పదార్ధాలలో పసుపు ఒకటి. ఈ విషయాన్ని నిరూపించడానికి ఎన్నో పరిశోధనలు ఉన్నాయి.
పసుపులోని అత్యంత శక్తివంతమైన భాగం కర్కుమిన్ – ఇది దాదాపు అన్ని విధాలుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, డయాబెటిస్ (మధుమేహం), మరియు అల్జీమర్స్ చికిత్సలలో ఉపయోగపడుతుంది అని చెప్పబడింది. ఇది ఎంతవరకు నిజం? అంతేకాక మీరు ఎన్నో సందర్భాల్లో పసుపు గాయాలను తగ్గిస్తుందని, సౌందర్య ఉత్పత్తులలో వాడతారనీ, చర్మ సౌందర్యానికి పరమ ఔషధమనీ విని ఉంటారు.
మీకు పసుపు ఎలా పనిచేస్తుంది? పసుపు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? పసుపు లోని పోషక విలువలు ఏమిటి? మీరు ఒక రోజులో ఎంత పసుపు తీసుకోవచ్చు? మీరు పసుపును ఎలా ఉపయోగించవచ్చు? పసుపు వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏమిటి? ఈ విషయాలను తెలుసుకోవాలని ఉందా? అయితే క్రిందికి స్క్రోల్ చేయండి.
In This Article
పసుపు అంటే ఏమిటి? – What is Turmeric?
పసుపు అల్లం కుటుంబానికి చెందిన మొక్క. దీని శాస్త్రీయనామం ‘కుర్కుమా లాంగా’. ఇది భారత ఉపఖండం మరియు ఆగ్నేయాసియాకు చెందినది.
ఈ మొక్క వేరు ఎక్కువగా ఉపయోగించబడుతుంది. పసుపును సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో కొన్ని యుగాలుగా ఉపయోగిస్తున్నారు.
పసుపు ఎందుకు మంచిది – What Is Turmeric Good For?
పసుపును ఎన్నో వ్యాధులకు చికిత్స చేయడానికి మరియు నివారణ కొరకు విస్తృతంగా ఉపయోగిస్తారు. దానిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, మరియు యాంటిక్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని ఎన్నోఅధ్యయనాలు పేర్కొన్నాయి (1).
పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు – Benefits of Turmeric in Telugu
పసుపు ఫ్రీ రాడికల్స్ తోనూ, వ్యాధులతోనూ పోరాడుతుంది. ఇది క్యాన్సర్ కణాల విస్తరణను కూడా నిరోధిస్తుంది.
పసుపులో ఉండే అతి ముఖ్యమైన బయోయాక్టివ్ సమ్మేళనం కర్కుమిన్. ఇతర సమ్మేళనాలలో కర్కుమినాయిడ్స్ మరియు కొన్ని నూనెలు ఉన్నాయి.
దీన్ని ఆర్థరైటిస్, చర్మ క్యాన్సర్, గాయాలు, కాలేయ వ్యాధులు మరియు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు మూలికా చికిత్సగా ఉపయోగిస్తారు (2).
పసుపు వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు- Health Benefits of Turmeric in Telugu
పసుపులోని గుణాలు, ప్రయోజనాలు, ప్రభావాలను దాన్ని ఆహారంలో చేర్చడం ద్వారా పొందవచ్చు. పసుపుపై చేసిన ఈ శాస్త్రీయ పరిశోధనల గురించి తెలుసుకుంటే, మీరు పసుపు లేని ఆహారాన్ని తినడానికి అస్సలు ఇష్టపడరంటే అతిశయోక్తి కాదేమో!
1. కాలేయాన్ని డిటాక్స్ చేస్తుంది
పసుపులోని యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కాలేయ వ్యాధులకు అద్భుత చికిత్సగా పని చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి (3). అయినప్పటికీ, మరిన్ని పరిశోధనలు అవసరం.
కాలేయం దెబ్బతినడానికి ప్రధాన కారణాలలో ఆక్సీకరణ ఒత్తిడి ఒకటి. పసుపులోని కర్కుమిన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలదు. ఇది కాలేయాన్ని కాపాడుతుంది మరియు గట్టిపడకుండా చేస్తుంది (4).
మనుషులలో నాన్-ఆల్కహాలిక్ ఫాటీ లివర్ వ్యాధి చికిత్సకు కూడా కర్కుమిన్ సహాయపడుతుంది (5).
2. డయాబెటిస్ (మధుమేహం) ను నిరోధిస్తుంది
పసుపులో కర్కుమిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది మరియు ఇది డయాబెటిస్ చికిత్సకు సహాయపడుతుంది (6). ఈ సమ్మేళనం డయాబెటిక్ న్యూరోపతిని కూడా నివారించగలదు.
పసుపు మధుమేహం సంబంధిత లోపాలను తొలగిస్తుంది (7). ముఖ్యంగా ఆక్సీకరణ ఒత్తిడికి చికిత్స చేస్తుంది.
కర్కుమిన్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడమే కాకుండా, రక్తంలో అధిక కొవ్వు స్థాయిని నియంత్రిస్తుంది.
మెట్ఫార్మిన్ (టైప్ 2 డయాబెటిస్‌కు వాడే మందు) ను పసుపుతో పాటూ తీసుకున్నప్పుడు గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ స్థాయిలు గణనీయంగా తగ్గాయి (8).
పసుపు బీటా కణాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బీటా కణాలు ఇన్సులిన్‌ను తయారు చేస్తాయి – ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించే హార్మోన్ (9).
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పసుపులోని కర్కుమిన్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పసుపులోని గుణాలు మన రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి, మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడతాయి.
4. క్యాన్సర్
కోలన్ (పెద్దప్రేగు) క్యాన్సర్, కడుపు క్యాన్సర్ మరియు చర్మపు క్యాన్సర్లకు వ్యతిరేకంగా పనిచేసే రక్షణ ప్రభావాన్నిపసుపు కలిగి ఉంటుంది. ఈ ప్రభావాన్ని స్థాపించడానికి మరింత పరిశోధనలు జరుగుతున్నాయి.
పసుపులో కర్కుమిన్ యొక్క లక్షణాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. కొన్ని అధ్యయనాలు ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించగలవని, అది వ్యాపించకుండా చేస్తాయని చూపిస్తున్నాయి. పసుపు కెమోథెరపీని మరింత ప్రభావవంతం చేసి ఆరోగ్యకరమైన కణాలను రక్షిస్తుంది.
కర్కుమిన్ క్యాన్సర్ కణాల నాశనానికి కూడా తోడ్పడుతుంది. ఇది రియాక్టివ్ ఆక్సిజన్ జాతులను స్కావెంజింగ్ చేయడం ద్వారా దీనిని సాధిస్తుంది (12).
ఆసక్తికరంగా, కర్కుమిన్ దాదాపు అన్ని రకాల క్యాన్సర్ కణాలపై ఒకేలాంటి ప్రభావాన్ని చూపుతుంది – ప్రోస్టేట్, ఊపిరితిత్తులు మరియు క్లోమం వంటి వాటితో సహా. క్యాన్సర్ కణాలను చంపడంలోనూ, ఆరోగ్యకరమైన వాటిని రక్షించడంలోనూ ఇది చక్కని పాత్ర పోషిస్తుంది (13).
5. బరువు తగ్గడానికి / జీవక్రియ మెరుగుపరచడానికి
పసుపులోని కర్కుమిన్ స్థూలకాయానికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ను నివారించవచ్చు (14). ఇది కొవ్వును కరిగించే ప్రక్రియను పెంచుతుంది – ఈ విషయాన్ని నిర్ధారించడానికి మరింత పరిశోధన అవసరం.
పసుపు ఎలుకలలో కొవ్వు కణజాలాల పెరుగుదలను తగ్గించింది. రక్త కేశనాళికల అభివృద్ధి (యాంజియోజెనిసిస్)ని పసుపు నిరోధిస్తుంది. శరీరంలో కొవ్వు పెరగడం వల్ల బరువు పెరుగుతుంది; యాంజియోజెనిసిస్ చర్యలు ఆగిపోయిన తరువాత ఇది జరగదు.
ఊబకాయానికి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ఒక కారణం. పసుపు ఇన్ఫ్లమేషన్తో పోరాడుతుంది కాబట్టి, ఇది ఊబకాయానికి చికిత్స చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది (16). పసుపులోని కర్కుమిన్ కొవ్వును నిల్వ చేసే కణాల ఉత్పత్తిని నిరోధిస్తుంది. దానితో పాటు జీవక్రియను మెరుగుపరుస్తుంది. సరైన ఆహారంతో పాటు వ్యాయామం కూడా చేస్తే తప్పక బరువు తగ్గుతారు. (17).
6. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు
పసుపు, దానిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాల కారణంగా, గాయాలు మరియు దీర్ఘకాలిక వాపు కారణంగా కలిగే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
7. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది
పసుపులో ఉండే కర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాన్ని అందిస్తుంది.
8. కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు రక్షణ కల్పిస్తుంది
ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మరణించే వాళ్లలో 31% మంది హృదయ సంబంధిత వ్యాధుల వల్ల మరణిస్తున్నట్లు తెలుస్తున్నది. అంటే దాదాపు 18 మిలియన్ల మంది!
పసుపులోని కర్కుమిన్ గుండె జబ్బులను నివారిస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కార్డియోటాక్సిసిటీ మరియు డయాబెటిస్ సంబంధిత గుండె సమస్యలను నివారిస్తాయి (19).
పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సక్రమంగా లేని హృదయ స్పందనలను నివారిస్తాయి.
ఎలుకలపై చేసిన అధ్యయనాలలో, కర్కుమిన్ రక్తపోటుకు కూడా చికిత్స చేసిందని తేలింది (20). రక్తపోటుకు చికిత్స చేయకపోతే, అది గుండెపోటుకు దారితీస్తుంది. తీవ్రమైన కొరోనరీ సిండ్రోమ్ ఉన్న వ్యక్తులలో, కర్కుమిన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించింది (21).
9. జీర్ణక్రియను మెరుగు పరచడానికి
పసుపు గ్యాస్ట్రిక్ అల్సర్లకు చికిత్స చేస్తుంది. పసుపుకు ఈ యాంటీఅల్సర్ ప్రభావం దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల నుండి వస్తుంది (22).
పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అన్నవాహికలో కలిగే మంట తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఈ విధంగా, కర్కుమిన్ గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) కి కూడా చికిత్స చేయవచ్చు.
ఇది ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, కొలొరెక్టల్ క్యాన్సర్, కాలేయ వ్యాధి మరియు విరేచనాలు వంటి జీర్ణ సంబంధ వ్యాధుల చికిత్సకు కూడా సహాయపడుతుంది (24).
10. అల్జీమర్స్ వ్యాధి నివారణకు
అల్జీమర్స్ వ్యాధి ఉన్న రోగులలో, పసుపు వారి మెదడు పనితీరును మెరుగుపరిచింది. పసుపులోని కర్కుమిన్ యొక్క యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ ప్రభావానికి కారణమని చెప్పవచ్చు (25).
పసుపులోని మరొక రసాయనం టుమెరోన్. జంతు అధ్యయనాలలో, టుమెరోన్ కొత్త మెదడు కణాలను ప్రేరేపించిందని తెలిసింది. అల్జీమర్స్ వ్యాధి మరియు ఇతర న్యూరోడీజనరేటివ్ పరిస్థితులకు చికిత్స చేయడానికి టుమెరోన్ బాగా సహాయపడుతుంది.
పసుపులోని కర్కుమిన్ డయాబెటిస్ ఉన్నవారిలో కూడా మెదడు పనితీరును పెంచుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడం ద్వారా ద్వారా డయాబెటిక్ న్యూరోపతిని నిరోధిస్తుంది (27).
11. సహజమైన పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది
పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.
12. నెలసరిలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది
నెలసరి రోజులలో కలిగే నొప్పికి పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బాగా పనిచేస్తాయి. పసుపు న్యూరోట్రాన్స్మిటర్ల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది – కనుక ఇది PMS లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది (28).
13. ఆర్థరైటిస్ కు
పసుపు రుమటాయిడ్ మరియు ఆర్థరైటిస్ ఉన్నవారిలో రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది (29). ఈ విషయంపై మరింత పరిశోధన అవసరం అయినప్పటికీ, ప్రారంభ అధ్యయనాలలో కనుగొన్న విషయాలు ఆశాజనకంగా ఉన్నాయి. పసుపు యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి (30). పసుపులోని కర్కుమినాయిడ్స్ మోకాలి నొప్పికి కూడా చికిత్స చేస్తాయి (31).
14. గాయాలకు చికిత్స చేయటానికి
ఏదైనా గాయమవ్వగానే మీ అమ్మమ్మలు పసుపు పెట్టమని చెప్పడం వినే ఉంటారు. నిజమే! పసుపుకు గాయాలను నయం చేసే శక్తి ఉంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గాయాలను నయం చేయడానికి దోహదపడతాయి. అందువల్ల గాయం అయినప్పుడు ఆలోచించకుండా పసుపు అద్దండి!
15. దగ్గు తగ్గుతుంది
పసుపు పొడిని మరిగించిన పాలతో కలిపి తీసుకుంటే దగ్గు మరియు ఇతర శ్వాసకోశ వ్యాధులు త్వరగా తగ్గుముఖం పడతాయి (32).
ఒక అధ్యయనంలో సిగరెట్ పొగ వల్ల ఎలుకలకి వచ్చిన ఊపిరితిత్తుల ఇబ్బందులను కర్కుమిన్ తగ్గించింది. ఇది ఎలుకలలో పల్మనరీ ఫైబ్రోసిస్యొక్క యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. ఈ విధంగా, కర్కుమిన్ బ్రోన్కైటిస్ (శ్వాస నాళముల వాపు) వంటి ఇతర శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు కూడా సహాయపడుతుంది (33). కర్కుమిన్ ఉబ్బసాన్ని కూడా తగ్గిస్తుందని మరో పరిశోధనలో తేలింది (34). పసుపు యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సైనస్ లలో కలిగే వాపును కూడా తగ్గిస్తాయి.
చర్మానికి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు: తెలుగులో- Skin Benefits of Turmeric in Telugu
భారతదేశపు చర్మ సౌందర్య పోషణలో పసుపుది ఎప్పుడూ అగ్రస్థానమే! చర్మం యొక్క రంగు మెరుగుపరచడం, మొటిమలు, మచ్చలు తగ్గించడం, మృతకణాలను తొలగించడం వంటి సమస్యలకి పసుపును మించిన పరిష్కారం లేదు. చర్మానికి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు వాడే విధానం చూడండి మరి!
1. మొటిమలను తగ్గించడానికి
పసుపు యొక్క యాంటీ బాక్టీరియల్ ప్రభావాలు మొటిమలతో సహా అనేక చర్మ సమస్యలకి చికిత్స చేయడంలో సహాయపడతాయి. మొటిమల వల్ల కలిగే మంట, ఎరుపులను తగ్గించడానికి ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది. పసుపును ఫేస్ మాస్క్ లో ఉపయోగించడం ద్వారా ఈ చర్మ సమస్యలను తగ్గించవచ్చు.
కావలసిన పదార్ధాలు
- 2 టేబుల్ స్పూన్లు మైదా
- 1 టీస్పూన్ పసుపు
- 3 టేబుల్ స్పూన్లు పాలు
- తేనె
వాడే విధానం
- పైన చెప్పిన పదార్ధాలను పేస్ట్ లా అయ్యేవరకు కలపండి.
- ఈ పేస్ట్ ను మీ ముఖానికి రాసుకుని 20 నిమిషాలు ఆరనివ్వండి.
- తర్వాత నీటితో కడిగి, మాయిశ్చరైజర్ రాయండి.
- కొంతమందికి పసుపు పడకపోవచ్చు. అందువల్ల, మీ ముఖానికి పసుపు వాడే ముందు ముందు మీరు ప్యాచ్ టెస్ట్ తప్పక చేయండి.
పసుపు, మొటిమలకు కారణమయ్యే అనేక బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
2. సోరియాసిస్
పసుపు యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు సోరియాసిస్ మరియు తామర చికిత్సకు సహాయపడతాయి. యాంటీబయాటిక్స్‌తో కలిపినప్పుడు, కర్కుమిన్ సోరియాసిస్ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
పసుపు యొక్క యాంటీఆక్సిడెంట్ లక్షణాలు గాయాలను నయం చేయడంలో కూడా సహాయపడతాయి. అవి రక్తప్రసరణ మెరుగుపరచి నొప్పిని తగ్గిస్తాయి. ఇది సోరియాసిస్ మరియు తామర వంటి చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.
సాంప్రదాయ మందుల దుష్ప్రభావాలు లేకుండా కర్కుమిన్, సోరియాసిస్ చికిత్సగా కూడా పనిచేస్తుంది (37).
3. ముఖంపై ముడతలు
పసుపు యొక్క యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి సహాయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి (38).
4. సన్‌బర్న్ తగ్గించడానికి (కమిలిన చర్మానికి చికిత్స)
పసుపులో యాంటీముటాజెనిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాక సూర్యకిరణాల వల్ల చర్మానికి జరిగే సన్‌బర్న్ వంటివాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది (39).
5. స్ట్రెచ్ మార్క్స్ కు (చర్మపు చారలు)
పసుపులో చర్మాన్ని బిగుతుగా చేసే గుణాలు ఉన్నాయి. సాగిన చర్మాన్ని బిగుతుగా చేసి స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి సహాయపడుతుంది.
కావలసిన పదార్ధాలు
- 2 టీ స్పూన్ల పసుపు
- 1 కప్పు పెరుగు
వాడే విధానం
- పసుపు మరియు పెరుగును మెత్తని పేస్ట్ లా కలపాలి.
- ఆ తరువాత ఆ పేస్ట్ ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రాంతంలో మృదువుగా రాయాలి.
- 30 నిమిషాలపాటు ఉంచి చల్లని నీటితో శుభ్రం చేయాలి.
- ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ కొద్దికొద్దిగా తగ్గుతాయి.
- స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా తగ్గడం కష్టం. కానీ ఇలా చేయడం వల్ల చాలావరకు తగ్గుతాయి.
- పిగ్మెంటేషన్ తగ్గడానికి
పసుపు ముఖంపై వచ్చే నల్ల మచ్చలు (పిగ్మెంటేషన్), డార్క్ సర్కిల్స్ తగ్గడానికి సహాయం చేస్తుందని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. దీనిపై మరింత పరిశోధన అవసరం.
7. పగిలిన పాదాలకు
పసుపులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పాదాల పగుళ్ళను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ ప్రయోజనం పొందడానికి:
కావలసిన పదార్ధాలు
- 1 టీ స్పూన్ పసుపు
- 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె
వాడే విధానం
- ముందుగా పాదాలను వేడినీటితో కడిగి, పాదాలపై ఉండే మృతకణాలను మృదువుగా తొలగించాలి.
- పసుపు, కొబ్బరి నూనెలను బాగా కలపాలి.
- దాన్ని పాదాలపై మృదువుగా రాసి 30 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
- ఇలా రోజుకు ఒకసారి చేయడం వల్ల పాదాలపై ఉండే పగుళ్లు కొద్దికొద్దిగా తగ్గుతాయి.
8. మృతకణాలను తొలగించడానికి (ఎక్స్ఫోలియేషన్ కు)
పసుపు చర్మంపై ఉండే మృతకణాలను తొలగించడానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది.
కావలసిన పదార్ధాలు
- 1 టీ స్పూన్ పసుపు
- ½ కప్పు శనగపిండి
- ½ కప్పు బియ్యపు పిండి
- కొద్దిగా పాలు (జిడ్డు చర్మం గలవాళ్ళు పాలకు బదులు నీళ్ళను, వాడవచ్చు)
- పొడి చర్మం గలవాళ్ళు నాలుగు చుక్కలు బాదం నూనె లేదా కొబ్బరి నూనె కూడా కలిపితే మంచిది.
వాడే విధానం
- పసుపు, శనగపిండి, బియ్యపు పిండి, పాలను ఒక బౌల్ లో వేసి మెత్తని పేస్ట్ లా అయ్యేలా కలపాలి.
- ఆ తరువాత ఆ పేస్ట్ ని ముఖంపై రాసుకొని ఒక 5 నిమిషాలపాటు మృదువుగా మసాజ్ చేయాలి.
- 30 నిమిషాలపాటు వదిలేసి, ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
- ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల ముఖంపై మృత కణాలు తొలగిపోయి చర్మం మృదువుగా తయారవుతుంది.
పసుపు వల్ల జుట్టుకు కలిగే ప్రయోజనాలు – Hair Benefits of Turmeric in Telugu
1: జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
2: చుండ్రుని నివారిస్తుంది
దీనిపై దాదాపు పరిశోధనలు లేవు. కొంతమంది జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి పసుపును ఉపయోగిస్తున్నారు – కాని ఖచ్చితమైన ఫలితాలు నమోదు కాలేదు.
పసుపు సాధారణంగా జుట్టుపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలను కలిగి ఉండదు కాబట్టి, మీరు ఒకసారి ప్రయత్నించండి. ముందు ఒకసారి మీ వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
పసుపులో గల పోషక విలువలు – Turmeric Nutritional Value in Telugu
కెలోరీలు | ||
---|---|---|
మోతాదు | %DV | |
కెలోరీలు | 23.9(100 kJ) | 1% |
పిండి పదార్ధాలు | 16.8(70.3 kJ) | |
కొవ్వులు | 5.6(23.4 kJ) | |
ప్రోటీన్లు | 1.5(6.3 kJ) | |
ఆల్కహాల్ | 0.0(0.0 kJ) | |
విటమిన్లు | ||
మోతాదు | %DV | |
విటమిన్ A | 0.0 IU | 0% |
విటమిన్ C | 1.7 mg | 3% |
విటమిన్ D | ~ | ~ |
విటమిన్ E | 0.2 mg | 1% |
విటమిన్ K | 0.9 mcg | 1% |
థయామిన్ | 0.0 mg | 1% |
రైబోఫ్లోవిన్లు | 0.0 mg | 1% |
నియాసిన్ | 0.3 mg | 2% |
విటమిన్ B6 | 0.1 mg | 6% |
ఫోలేట్ | 2.6 mcg | 1% |
విటమిన్ B12 | 0.0 mcg | 0% |
పంథాథెటిక్ ఆసిడ్ | ~ | ~ |
కోలిన్ | 3.3 mg | |
బెటైన్ | 0.7 mg | |
మినరల్స్ | ||
మోతాదు | %DV | |
కాల్షియమ్ | 12.4 mg | 1% |
ఇనుము | 2.8 mg | 16% |
మెగ్నేషియం | 13.0 mg | 3% |
భాస్వరం | 18.1 mg | 2% |
పొటాషియం | 170 mg | 5% |
సోడియం | 2.6 mg | 0% |
జింక్ | 0.3 mg | 2% |
రాగి | 0.0 mg | 2% |
మాంగనీస్ | 0.5 mg | 26% |
సెలీనియం | 0.3 mcg | 0% |
ఫ్లోరైడ్ | ~ |
పసుపు ఎలా ఉపయోగించాలి – How to Use Turmeric in Telugu
మీ ఆహారంలో పసుపు వాడడం సులభం. పసుపు వాడడానికి కొన్ని విధానాలు క్రింద ఇవ్వబడ్డాయి.
- కాల్చిన బంగాళాదుంపలు మరియు కాలీఫ్లవర్లపై చిటికెడు పసుపు చల్లండి. ఇది చక్కని ఈవెనింగ్ స్నాక్ అవుతుంది.
- గ్రీన్ సలాడ్లలో కొద్దిగా పసుపు చల్లండి. ఇది పోషక విలువలను పెంచుతుంది.
- సూప్‌లను ఎవరు ఇష్టపడరు? వాటిలో కొంచెం పసుపు కలపండి, అంతే! ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం మీకోసం సిద్ధంగా ఉంటుంది.
- మీరు చేసే ప్రతీ కూర, పప్పు, పులుసులలో ఒక చిటికెడు పసుపు వేయండి.
- మీరు పసుపు టీ కూడా తయారు చేసుకోవచ్చు.
- కొబ్బరి పాలలో పసుపు మరియు తేనెలను కలిపి తీసుకుంటే రుచిగా ఉంటుంది.
- పసుపు మాత్రలు / మందులు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాస్తవానికి, వాటికి ప్రత్యేక ప్రయోజనాలున్నాయి. అన్ని బ్రాండ్లు నమ్మదగినవి కావు కాబట్టి జాగ్రత్త వహించండి. వీటి విషయంలో మీ వైద్యులను సంప్రదించండి.
పసుపు మన చుట్టూ ఉంది. దీన్నిటూత్పేస్ట్, సౌందర్య సాధనాలు, సబ్బులు మరియు ఫేస్ వాష్ లలో ఉపయోగిస్తారు. దీన్ని సాధారణంగా బయోపెరిన్తో కలుపుతారు (40).
పసుపు వల్ల కలిగే దుష్ప్రభావాలు – Side Effects of Turmeric in Telugu
1. గర్భధారణ సమయం
గర్భధారణ మరియు పిల్లలకి పాలిచ్చే సమయంలో పసుపు తీసుకోవడం సమస్యలను కలిగిస్తుందని అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పసుపును ఆహారంలో సురక్షితమే కానీ మీ వైద్యులను సంప్రదించండి.
2. కిడ్నీ స్టోన్స్ పెరగవచ్చు
పసుపులో 2% ఆక్సలేట్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువ మోతాదులలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారిలో సమస్యలకు దారితీస్తుంది. ఈ విషయం గురించి మీ వైద్యులతో మాట్లాడడం మంచిది.
3. ఐరన్ లోపము
పసుపు ఐరన్ ను నిరోధించవచ్చు మరియు ఇనుము లోపానికి కారణం కావచ్చు. ఐరన్ లోపం ఉన్న వ్యక్తులు అధిక మోతాదులో పసుపును తీసుకోకూడదు.
4. రక్తం గడ్డకట్టడంలో సమస్యలు
పసుపు రక్తం గడ్డకట్టడాన్ని ఆలస్యం చేస్తుంది. మీకు రక్తం గడ్డకట్టడంలో లోపాలు లేదా రెండు వారాలలోపు చికిత్స ఉంటే పసుపు వాడకండి.
పరిశోధనల ప్రకారం పసుపు మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీన్ని మీ డైట్లో చేర్చి మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు – అది కూడా పెద్దగా కష్టపడక్కర్లేకుండా!
మీ వంటకాలలో పసుపును చేర్చడం అతి సులభమైన మార్గం – చాలా రుచికరమైనది కూడా!
మరి మీ ఆహార పదార్ధాలలో మీరు పసుపును కలుపుతున్నారా? కింది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం ద్వారా మీ అనుభవాలను మాకు తెలియజేయండి.